డ్రైవింగ్‌ చేస్తూ ఫొటోలు తీస్తే 800 దిర్హామ్‌ల జరిమానా

- November 27, 2018 , by Maagulf
డ్రైవింగ్‌ చేస్తూ ఫొటోలు తీస్తే 800 దిర్హామ్‌ల జరిమానా

దుబాయ్‌: డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఫొటోలు తీస్తే, క్షణాల్లో పరిస్థితులు విపరీతంగా మారొచ్చు. అందుకే భారీ జరిమాణాలతో ఈ తరహా ఉల్లంఘనలకు చెక్‌ పెడుతున్నారు పోలీసులు. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ - దుబాయ్‌, మోటరిస్టులకు ఈ విషయమై హెచ్చరికలు జారీ చేసింది. డ్రైవింగ్‌ చేస్తూ సెల్ఫీలు దిగినా, ఫొటోలు తీసినా 800 దిర్హామ్‌ల జరిమానా, నాలుగు బ్లాక్‌ పాయింట్స్‌ విధించనున్నట్లు పేర్కొంది ఆర్‌టిఎ. ఫోన్లలో ఫొటోలు తీయడం ద్వారా రియాక్షన్‌ టైమ్‌ తగ్గిపోతుందని ఆర్‌టిఎ వివరించింది. ఒక్క సెకెన్‌లో రోడ్డు మీద పరిస్థితులు మారిపోతాయనీ, అలా చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశంతోపాటు, తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం వుంటుందని వాహనదారుల్ని హెచ్చరించింది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com