విజయ్ దేవరకొండ కు ఫిదా అయిన జాన్వీ కపూర్
- November 27, 2018
అతిలోక సుందరి, అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నోట విజయ్ దేవరకొండ మాట వచ్చింది. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన విజయ్ దేవరకొండ గురించి జాన్వీ కపూర్ స్పందించింది. ఇటీవల విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ సినిమా చేయనున్నట్లు ఒక వార్త షికారు చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ వార్తలో నిజం లేదు కానీ, జాన్వీ మాత్రం విజయ్ గురించి మాట్లాడింది.
కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోలో ఇటీవల శ్రీదేవి కుమార్తె పాల్గొనగా, ఆ సమయంలో నువ్వు మగాడిగా మారితే ఎవరిలా ఉండాలని కోరుకుంటావు అన్న ప్రశ్నకు స్పందిస్తూ… విజయ్ దేవరకొండ అంటూ సమాధానమిచ్చింది. మగాడిగా మారితే విజయ్ దేవరకొండ మాదిరిగా మారుతానని ఉత్తరాదిన ఎంతో మంది యంగ్ హీరోలుండగా, దక్షిణాదిన హీరోగా ఎదుగుతోన్న విజయ్ దేవరకొండ పేరును జాన్వీ కపూర్ చెప్పడం అందరినీ షాక్ ఇచ్చింది. దీనితో విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు.
అంతేగాకుండా భవిష్యత్తులో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తానని కూడా తెలిపింది. అలాగే, అతనిలో సెక్స్ అప్పీల్ తనకు ఎంతో నచ్చుతుందని తెలిపింది, విజయ్ మంచి ప్రతిభ ఉన్న నటుడు కూడా అని వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







