రోడ్డు ప్రమాదం: ఎమిరేటీ యువకుడి మృతి
- November 27, 2018
ఫుజైరాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఓ యువకుడ్ని బలి తీసుకుంది. ఆ యువకుడు ప్రయాణిస్తున్న కారు ఓవర్ టర్న్ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్తున్న కారుని సదరు యువకుడు అదుపు చేయలేకపోయాడు. ఫుజైరాలోని అల్ బుదియాహ్లో రఫ్ రోడ్డుపై రపమాదం జరిగినట్లు తెలుస్తోంది. దిబ్బా ఫుజైరా పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ రషీద్ అల్ జాహ్మి మాట్లాడుతూ, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆపరేషన్ రూమ్ ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్స్ సంఘటనా స్థలానికి పంపించారు. అతన్ని ఖోర్ఫఖ్కన్ హాస్పిటల్కి తరలించగా, వైద్యులు అతని ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







