తెలంగాణ లో మోడీ బహిరంగ సభ

- November 27, 2018 , by Maagulf
తెలంగాణ లో మోడీ బహిరంగ సభ

తెలంగాణ:కొందరి పాదాల దగ్గర పడుండే వ్యక్తులకు కాకుండా ప్రజల పాదాల దగ్గర పడుండే వ్యక్తులకు అవకాశమివ్వాలని తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అధికారంలో ఎవరున్నా తమకు తలవంచాల్సిందే అని మజ్లిస్ పార్టీ అంటోందన్న మోదీ, ఆ పార్టీకి సలాం చేసే పార్టీలను ఇంటికి పంపించాల్సిన సమయమొచ్చిందన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఒకే నాణానికి రెండు పార్శ్వాలని ఘాటుగా విమర్శించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగసభలో మోదీ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఈ సభకు తరలి వచ్చారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ, ఒక కుటుంబ సంతోషం తెలంగాణ ఉద్యమం సాగిందా అని ప్రశ్నించారు. కృష్ణా నది ప్రవహిస్తున్నా పాలమూరు జిల్లాలో ఇంకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయని నిలదీశారు. పాలమూరు వెనకబాటుతనపై టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లను నిలదీయాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com