తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల

- November 27, 2018 , by Maagulf
తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. 37 అంశాలతో కూడిన ఈ మ్యానిఫెస్టోలో జయజయహే గీతాన్ని తెలంగాణ గీతంగా మార్చుతామని.. టీఎస్ కోడ్ ను టీజీగా మార్చుతామని.. రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్, కొలు రైతులకు కూడా రైతు బంధు పథకం, ఉద్యమం సమయంలోని కేసులన్నీ ఎత్తివేత, పంటలకు మద్దతు ధర, ఐదువేల కోట్లతో ధరల స్థీరీకరణ, అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్ కార్మికులకు ఐదు వందల కోట్లతో సంక్షేమ నిధి, అన్ని జిల్లాలలో అమరవీరుల స్థూపాలు, నిరుద్యోగులకు మూడువేల భృతి, మైనార్టీలకు సబ్ ప్లాన్ తదితర అంశాలను చేర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com