యూఏఈ మొబైల్‌ నెట్‌వర్క్స్‌కి కొత్త పేర్లు

- November 28, 2018 , by Maagulf
యూఏఈ మొబైల్‌ నెట్‌వర్క్స్‌కి కొత్త పేర్లు

యూఏఈ టెలికమ్‌ నెట్‌వర్క్‌ ప్రొవైడర్స్‌ డు మరియు ఎటిసలాట్‌ తమ నెట్‌ వర్క్స్‌ పేర్లను '30 నవంబర్‌'గా మార్చాయి. కమ్మొమరేషన్‌ డే (గతంలో మార్టీర్స్‌ డేగా వ్యవహరించేవారు) గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నాయి ఆయా సంస్థలు. అమరవీరుల త్యాగాల్ని గుర్తుచేసుకునేందుకు తమవంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎటిసలాట్‌, ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రతి యేడాదీ నవంబర్‌ 30వ తేదీని కమ్మొమరేషన్‌గా పాటిస్తూ వస్తున్నారు. తొలి ఎమిరేటీ, దేశం కోసం ప్రాణం విడిచిన రోజు అది. ఉదయం 8 గంటలకు యూఏఈ ఫ్లాగ్‌ హాఫ్‌ మాస్ట్‌ జరుగుతుంది. ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ఒక నిమిషంపాటు మౌనం పాటిస్తారు. మినిస్టర్స్‌, ప్రైవేట్‌ మరియు పబ్లిక్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఆ తర్వాత ఫ్లాగ్‌ని రెయిజ్‌ చేస్తారు.. జాతీయ గీతం ఆలపించబడుతుంది. ఇదిలా వుంటే, ఎటిసలాట్‌.. డు వినయోగదారులు నెట్‌ వర్క్‌ పేరు మార్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com