పాకిస్థాన్‌కు ఇండియా ఝలక్!
- November 28, 2018
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో జరగనున్న సార్క్ సమావేశాల్లో పాల్గొనబోమని ఇండియా తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాని మోదీకి పాకిస్థాన్ పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకోకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ వెళ్లే ప్రసక్తే లేదని ఇండియా స్పష్టం చేసింది. నిజానికి ఈ సార్క్ సమావేశం 2016లోనే జరగాల్సింది. అయితే అప్పట్లో యురి ఉగ్రదాడి నేపథ్యంలో తాము పాల్గొనబోమని భారత్ చెప్పింది. బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘనిస్థాన్ కూడా వెనుకడుగు వేయడంతో ఆ సదస్సు రద్దయింది. ప్రతి రెండేళ్లకోసారి సార్క్‌లోని ఎనిమిది సభ్యదేశాల్లో ఒకటి సమావేశాలను నిర్వహిస్తుంది. 2016లో రద్దవడంతో ఇప్పుడు పాకిస్థాన్‌కు మరో అవకాశం వచ్చింది. ఈసారి కర్తార్‌పూర్ కారిడార్ పనుల ప్రారంభంలో భారత్‌కు చెందిన మంత్రులు కూడా పాల్గొననున్న నేపథ్యంలో సార్క్ సమావేశాలకు రావాల్సిందిగా ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం పంపినా భారత్ తిరస్కరించింది. చివరిసారి సార్క్ సమావేశాలు 2014లో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







