విమానం గాల్లో ఉండగానే నిద్రపోయిన పైలట్
- November 28, 2018
విమానం గాల్లో ఎగురుతుండగానే ఓ పైలట్ నిద్రపోయాడు. కాస్త కునుకు తీసి మళ్ళీ తేరుకొని ప్రశాంతంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన నవంబర్ 8న జరిగింది. విమానం చేరాల్సిన గమ్యానికి చేరుకోకుండా యాభై కిలోమీటర్లు దూరం ఎక్కువగా ప్రయాణించి ల్యాండ్ అయింది.
దేవన్‌పోర్ట్ నుంచి టాస్మానియాలోని కింగ్ ఐస్లాండ్ కు ప్రయాణిస్తున్న విమానాన్ని నడుపుతున్న పైలట్‌కు కాస్త కునుకు పట్టడంతో హాయిగా నిద్రపోయాడు. విమానం కుదుపులకు లోనవడంతో వెంటనే తేరుకొని దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అందులో ప్రయాణిస్తుంది ఆ పైలట్ ఒక్కడే . ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. విమానం ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్‌పోర్ట్‌లో కాకుండా మరో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవడంపై విచారణకు ఆదేశించారు. కింగ్ ఐస్లాండ్ నుంచి మరో 46 కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించిందని ఆస్ట్రేలియా ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో(ఏటీఎస్బీ) తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







