పెళ్లి పీటలు ఎక్కనున్న శ్వేతా బసు
- November 28, 2018
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో యువతను కొత్త ప్రపంచంలోకి తీసికెళ్ళిన శ్వేతా బసు త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. శ్వేతా బసు చిన్న సినిమాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ రెండేళ్ళ నుండి కలిసి జీవిస్తున్నారు.
ఈ ఏడాదిలో జూన్‌లో వీరి నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. డిసెంబర్ 13న వీరి వివాహం జరగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 11 ఏళ్ళ ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చిత్ర పరిశ్రమలోకి శ్వేతా అడుగు పెట్టింది. సినిమాల్లో ఆమె నటనకు పలు నేషనల్ అవార్డులు వరించాయి. శ్వేతా రీసెంట్గా స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ కూడా జరుపుకుంది. పూణేలో రోహిత్, శ్వేతల వివాహం జరుగనుండగా, ముంబైలో రిసెప్షన్ జరుపుకోనుందట.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







