కుప్ప కూలిన ఆర్మీ శిక్షణ విమానం
- November 28, 2018
యాదగిరి గుట్ట మండలం బాహుపేట వద్ద ఆర్మీ శిక్షణ విమానం కుప్ప కూలింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ పారాచూట్ సహాయంతో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. క్షణాల్లో విమానం కళ్లముందే కాలి బూడిద అయింది. పైలెట్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగేశ్‌గా గుర్తించారు.
విషయం తెలిసిన వెంటనే ఆర్మీ వైద్యులు మరో హెలికాప్టర్ని తీసుకుని ప్రమాదస్థలికి చేరుకున్నారు. చిన్న చిన్న గాయాలైన పైలెట్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆలేరు పట్టణ సమీపంలోని సాయిబాబా గుడి దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ వెంచర్ లో ఈ ట్రైనింగ్ విమానం కూలినట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







