భారీ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ 10 మంది

- November 28, 2018 , by Maagulf
భారీ అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ 10 మంది

రస్‌ అల్‌ ఖైమా:రస్‌ అల్‌ ఖైమా లో జరిగిన ఓ భారీ అగ్ని ప్రమాదం నుంచి 10 మంది రెసిడెంట్స్‌ క్షేమంగా బయటపడ్డారు. అల్‌ ఉరైబి ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు రస్‌ అల్‌ ఖైమా సివిల్‌ డిఫెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరగగా, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు. వాటర్‌, ఫోమ్‌ ఉపయోగించి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో 10 మందిని సివిల్‌ డిఫెన్స్‌ రక్షించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. పెద్ద పెద్ద ప్రమాదాలు నివారించేందుకు ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్స్‌ని ఉపయోగించాలనీ, ఈ విషయంలో ఎవరూ రాజీ పడకూడదని సివిల్‌ డిఫెన్స్‌ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com