తాలిబన్‌తో చర్చలకు 12మందితో బృందం

- November 28, 2018 , by Maagulf
తాలిబన్‌తో చర్చలకు 12మందితో బృందం

కాబూల్‌: తాలిబన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు ఆఫ్ఘన్‌ ప్రభుత్వం 12మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ జెనీవాలో బుధవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజలతో అనేక మాసాలు పాటు సంప్రదింపులు జరిపిన తర్వాత శాంతి చర్చలకు ఒక ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు. ఇక్కడ జరుగుతున్న రెండు రోజుల ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. మహిళలతో సహా పౌరుల రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులు పరిరక్షించబడతాయని ఆయన హామీ ఇచ్చారు. అధ్యక్ష భవన కార్యాలయ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సల్మాన్‌ రహిమి నేతృత్వంలో ఈ బృందం చర్చలు జరుపుతుంది. ఈ బృందంలో మహిళలు, పురుషులు వున్నారు. తీవ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధాలు కలిగిన ఏ సంస్థను రాజకీయక్రమంలో చేరేందుకు అనుమతించేది లేదని ఘని స్పష్టం చేశారు. కాగా చర్చలకు ముందు షరతుగా అంతర్జాతీయ బలగాలు వైదొలగాలని తాలిబన్‌ డిమాండ్‌ చేస్తోంది. శాంతి క్రమాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నెల ఆరంభంలో తాలిబన్‌ అధికారులు అమెరికా ప్రత్యేక ప్రతినిధితో మూడు రోజుల పాటు చర్చలు జరిపారు.ఈ చర్చల్లో ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com