తాలిబన్‌తో చర్చలకు 12మందితో బృందం
- November 28, 2018
కాబూల్: తాలిబన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వం 12మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసిందని అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ జెనీవాలో బుధవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రజలతో అనేక మాసాలు పాటు సంప్రదింపులు జరిపిన తర్వాత శాంతి చర్చలకు ఒక ప్రణాళిక రూపొందించామని ఆయన చెప్పారు. ఇక్కడ జరుగుతున్న రెండు రోజుల ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. మహిళలతో సహా పౌరుల రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన హక్కులు పరిరక్షించబడతాయని ఆయన హామీ ఇచ్చారు. అధ్యక్ష భవన కార్యాలయ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సల్మాన్ రహిమి నేతృత్వంలో ఈ బృందం చర్చలు జరుపుతుంది. ఈ బృందంలో మహిళలు, పురుషులు వున్నారు. తీవ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధాలు కలిగిన ఏ సంస్థను రాజకీయక్రమంలో చేరేందుకు అనుమతించేది లేదని ఘని స్పష్టం చేశారు. కాగా చర్చలకు ముందు షరతుగా అంతర్జాతీయ బలగాలు వైదొలగాలని తాలిబన్ డిమాండ్ చేస్తోంది. శాంతి క్రమాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నెల ఆరంభంలో తాలిబన్ అధికారులు అమెరికా ప్రత్యేక ప్రతినిధితో మూడు రోజుల పాటు చర్చలు జరిపారు.ఈ చర్చల్లో ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..