ఇండియన్స్ ఇ-మైగ్రేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిపై ఊరట
- November 28, 2018
యూఏఈ మరియు 17 ఇతర దేశాల్లో పనిచేసేందుకు వెల్ళే భారతీయులు, తప్పనిసరిగా ఇ-మైగ్రేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కొత్త విధానాన్ని భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న సంగతి తెల్సిందే. జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకోగా, దీనిపై అభ్యంతరాల నేపథ్యంలో ప్రస్తుతానికి కొంత ఊరట లభించినట్లే. ఈ విషయమై అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ, స్పష్టతనిచ్చింది. నవంబర్ 14న, ఇమ్మిగ్రేషన్ చెక్ అవసరమైన 18 దేశాలకు పని నిమిత్తం వెళ్ళే భారతీయులు, తమ భద్రత దృష్ట్యా ఇ-మైగ్రేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఎన్నారై కమ్యూనిటీ నుంచి ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనీ, అయితే డిపెండెంట్స్, ఇన్వెస్టర్ వీసాలకు దీని నుంచి ఉపశమనం ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. కాగా, ఇది స్వచ్ఛందంగా చేసుకునే రిజిస్ట్రేషన్ అని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. స్వదేశంలోని అడ్రస్, విదేశాల్లోని అడ్రస్ని, వర్క్ డిటెయిల్స్‌ని, పాస్‌పోర్ట్ నెంబర్, ప్రొఫెషన్, ఎమర్జన్సీ కాంటాక్ట్ డిటెయిల్స్‌ని అందులో నమోదు చేయాల్సి వుంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఇండియా ఫోన్ నెంబర్‌కి వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ తప్పనిసరి. ఆఫ్గనిస్తాన్, బహ్రెయిన్, ఇండోనేసియా, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, లిబియా, మలేసియా, ఒమన్, కతార్, సౌదీ అరేబియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, థాయిలాండ్, యూఏఈ మరియు యెమెన్ ఈ లిస్ట్‌లో వున్న దేశాలు. అరబ్ దేశాల్లో అత్యధికంగా భారతీయ వర్క్ ఫోర్స్ వుంటుంది. మొత్తం అన్ని గల్ఫ్ దేశాల్లో కలుపుకుంటే సుమారుగా 8.9 మిలియన్ల మంది భారతీయులు వున్నట్లు ఓ అంచనా.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..