సినీ నటి ఆత్మహత్య
- November 29, 2018
సినీ నటి రియామికా ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు ఆమె సోదరుడు తెలిపారు. చెన్నై సమీపంలోని శ్రీదేవికి కుప్పానికి చెందిన రియామిక, తన సోదరుడు ప్రకాశ్‌తో కలిసి గత నాలుగు నెలలుగా వలసారవాకంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఉన్నత చదువులు చదివిన ఆమె సినిమాలపై ఆసక్తితో సినీరంగంవైపు వచ్చారు. దాంతో కుద్రతైల్ కుమారాం కొందత్తం, అఘోరి యనిట్టం ఆరంభం వంటి పలు తమిళ చిత్రాల్లో కథానాయికిగా నటించారు. బుధవారం సాయంత్రం సోదరుడు ప్రకాశ్ ఇంటికి చేరుకునేసరికి లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో బలవంతంగా తలుపు తెరిచి చూడగా రియామిక తన బెడ్‌రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. భయాందోళన చెందిన ప్రకాష్ వెంటనే ఇతర కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







