రోబో '2.0' రివ్యూ

రోబో '2.0' రివ్యూ

రోబో '2.0' రివ్యూ
నటీనటులు : రజినీకాంత్ ,అక్షయ్ కుమార్ ,అమీ జాక్సన్ తదితరులు
సంగీతం : ఏఅర్ రెహ్మాన్
సినిమాటోగ్రఫర్ : నిరవ్ షా
ఎడిటింగ్ : ఆంటోనీ
దర్శకత్వం : యస్ శంకర్
నిర్మాత : సుభాష్ కరణ్
బ్యానర్ - లైకా ప్రొడక్షన్
విడుదల తేది - 29.11.2018
నిడివి - 153 నిమిషాలు..

విజువల్ మాంత్రికుడు శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ క్యాంబో రూ 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన మూవీ 2.0. ఈ మూవీ నిర్మాణానికి చిత్ర యూనిట్ ఏకంగా నాలుగేళ్లు కష్ట పడింది.. ఒక్క విజవల్ కోసమే ఏకంగా రూ 350 కోట్లు ఖర్చు చేశారు.. అంతకు తగ్గట్టే విడుదలైన టీజర్, ట్రైలర్, స్టిల్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెంచేశాయి.. భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది.. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే..

కథ
చెన్నై మహానగరం.. ఎవరీ పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు..అంతలో ఒక్కసారిగా వాళ్ల చేతుల్లో ఉన్న సెల్ ఫోన్స్ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి మాయమైపోతున్నాయి.. సిలీంగ్స్, కాంక్రీట్ గోడలను సైతం సెల్ ఫోన్స్ చీల్చుకుని ఆకాశం లోకి దూసుకుపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆ సెల్ ఫోన్స్ అన్ని కలిసి ఒక పక్షి(అక్షయ్ కుమార్) ఆకారంలో మారి అతి దారుణంగా కొంతమందిని చంపుతుంది..దాంతో ఆ ఫోన్స్ గురించి తెలుసుకోవడానికి సైంటిస్ట్ వశీకరన్ (రజినీ కాంత్ ) తన టెక్నాలజీని ఉపయోగించి.. చివరకి ఆ సెల్ ఫోన్స్ ను ఓ నెగిటివ్ ఫోర్స్ మాయం చేస్తుంది అని తెలుసుకుంటాడు. దీన్ని చిట్టి మాత్రమే పరిష్కరించగలడని భావించి మళ్లీ దానికి ప్రాణం పోస్తాడు వంశీకరణ్.. చిట్టి ఆ నెగిటివ్ ఫోర్స్ ని అంతం చెయ్యడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? చివరకి అంతం చేశాడా లేడా ? ఈ క్రమంలో చిట్టి 2.ఓ గా రీ లోడ్ ఏలా అయింది. అసలు ఆ నెగిటివ్ ఫోర్స్ కు సెల్ ఫోన్స్ కు ఉన్న సంబంధం ఏమిటి ? దీని వెనకాల ఉన్న కథ ఏమిటి ? చిట్టి 2.ఓ ఈ పరిస్థితి ని అదపులోకి తెచ్చాడా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే..
 

విశ్లేషణ

ముందుగా దర్శకుడు శంకర్ గురించి చెప్పాలి.. ఇప్పటి వరకూ శంకర్‌ సినిమా సామాజిక స్పృహ, సందేశాత్మక సినిమాలు చేశాడు.. ఈసారి కూడా సామాజిక కోణంలోంచే కథను ఎంచుకుని దానికి అధునాతన సాంకేతికతను జోడించాడు.. నీరు లేని గ్రామాలు ఉండోచ్చేమో గానీ ఇప్పుడు సెలఫోన్ల వాడిని మనిషి కనిపించడం లేదు.. సెల్ ఫోన్ నే కథగా ఎంచుకున్నాడు శంకర్. దీనికి మనుషులు ఏవిధంగా బానిసవుతున్నారో? దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు.. ఇందుకు రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి టాప్ స్టార్స్ ఎంచుకున్నాడు.. ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రంలో ఉత్తమమైన నటనను కనబర్చాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. సినిమాకే అతి కీలక మైన పాత్రలో అత్యంత క్రూరమైన పాత్రలో, క్రో మ్యాన్ గా నటించిన అక్షయ్ కుమార్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఈ పాత్రకు అతడు తప్ప మరెవరూ న్యాయం చేయలేరనే విధంగా మెప్పించాడు అక్షయ్. యాక్షన్ సీక్వెన్సెస్ అక్షయ్ ఇరగదీశాడనే చెప్పాలి.. ఈ పాత్ర ముందు చిట్టి పాత్ర వెలవెల బోయిందంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు..అమీ జాక్సన్ రోబో గా చూపడంలో ఆమె అందాలు ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలువలేకపోయాయి.. మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. దర్శకుడు శంకర్ ఎక్కడా విజువల్ ట్రీట్ తగ్గకుండా, కథలోని ఎమోషన్ని చాలా బ్యాలెన్స్ డ్ గా నడుపుతూ మంచి దర్శకత్వ పనితనం కనబర్చారు. సెల్ ఫోన్ కు సంబధించి ఆయన చెప్పాలనుకున్న అంశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. ఇంటర్వేల్ బ్యాంగ్, సెంకడాఫ్ లో ఎమోషన్ సీన్స్, క్లమాక్స్ లో అరగంట దర్శకుడి ప్రతిభకు గీటురాయిగా నిలిచాయి. ఆస్కార్‌ అవార్డు గ్రహీతలు ఏఆర్ రెహ్మాన్, సౌండ్ ఇంజనీర్ రసూల్‌ పూకుట్టి చేసిన మాయ అందరినీ అబ్బురపరుస్తుంది. స్వర మాంత్రికుడు తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయగా, ఇండియన్‌ సినిమాలో 4డీ సౌండ్‌ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్‌ తీసుకెళ్లారు. నీరవ్‌ షా అందించిన సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే..దర్శకుడు విజన్ ను చాలా గొప్పగా తెరపై చూపాడు నీరవ్ షా.. ఇక గ్రాఫిక్స్ గురించి చెప్పుకోవాలంటే ఇంత వరకూ ఏ భారత దేశ సినిమాలో ఇటువంటి వండర్ గ్రాఫిక్స్ కనిపించలేదు.. రెండేళ్లు గ్రాఫిక్ టీమ్ పడిన శ్రమ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది..ఒక రకంగా గ్రాఫిక్స్ తోనే మూవీని నడిపించి అందర్ని మాయలో పడేశాడు దర్శకుడు శంకర్..ఆంటోని ఎడిటింగ్ కూడా ఈ మూవీ ప్లస్ పాయింట్ అయింది.. గందరగోళం లేకుండా నీట్ గా కత్తెరకు పదను పెట్టి మంచి సినిమాను బయటకు తీసుకురాగలిగాడు ఎడిటర్ ఆంటోని..లైకా ప్రొడక్షన్ ఖర్చుకు వెనకాడకుండా ఈ మూవీని నిర్మించడం అభినందించతగ్గ విషయం.. చివరగా ఈ మూవీ భారత్ విజువల్ వండర్ మూవీ అని చెప్పవచ్చు.. ప్రతి ఒక్కరూ ఈ మూవీని చూడాలి.. అయితే 3 డిలో ధియేటర్లలో చూస్తేనే ఈ మూవీ మజాను పూర్తిగా ఆస్వాదించగలం.
కామెంట్ - విజువల్ బ్లాక్ బస్టర్

ఈ సినిమా ని గల్ఫ్ లో 'Golden Cinema' వారు తెలుగు,తమిళం,హిందీ భాషల్లో విడుదల చేసారు.


--మాగల్ఫ్ రేటింగ్ - 3.5/5

Back to Top