యూ.ఏ.ఈ:రేపటితో ముగియనున్న ఆమ్నెస్టీ
- November 29, 2018
యూ.ఏ.ఈ:నవంబర్ 30వ తేదీతో అమ్నెస్టీ ముగుస్తుందనీ, ఎలాంటి పొడిగింపులూ లేవని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్ (ఎఫ్‌ఎఐసి) స్పష్టం చేసింది. ఆమ్నెస్టీ ముగిసిన వెంటనే, దేశమంతటా ఎక్కడికక్కడ స్పెషల్ క్యాంపెయిన్స్ నిర్వహించి, అక్రమ వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గడువు ముగిసేలోపు ఆమ్నెస్టీని వినియోగించుకోవాలని అధికారులు గుర్తు చేస్తున్నారు. 'ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ బై మాడిఫైయింగ్ యువర్ స్టేటస్' పేరుతో ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అమ్నెస్టీని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే మరో నెలరోజులపాటు ఆమ్నెస్టీని పొడిగించారు. ఆ గడువు కూడా రేపటితో ముగియనుండడంతో అధికారులు, అక్రమ నివాసితుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఆమ్నెస్టీ పీరియడ్‌లో కొందరు తమ స్టేటస్‌ని సరిదిద్దుకుంటే, మరికొందరు దేశం విడిచి వెళ్ళేందుకు మొగ్గు చూపినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







