తెలంగాణ:బీజేపీ మ్యానిఫెస్టో విడుదల
- November 29, 2018
తెలంగాణ బీజేపీ మ్యానిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ్యానిఫెస్టో అమలులో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రజలను వంచించిన టీఆర్ఎస్.. మ్యానిఫెస్టోకు విలువ లేకుండా చేసిందని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలు నిండుమనసుతో ఆశీర్వదిస్తే.. ప్రతి హామీని నెరవేరుస్తామని అన్నారు. తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. ఇంటి అద్దె ఇస్తామన్న బీజేపీ హామీని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిందన్నారు. సీపీఎస్ రద్దు, పదవీ విరమణ వయస్సు 60కి పెంచుతామని, డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అలాగే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. జైలుకు వెళ్లిన ఉద్యమకారులకు రూ.5000 పెన్షన్, అమరులకుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కాపు, యాదవ, మున్నూరు కాపు వారికి ఫెడరేషన్ ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. కుల వృత్తులకు ఉచిత విద్యుత్, ఆంధ్ర ప్రాంత కులాలకు బీసీ హోదా, 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులకు 3 వేల పెన్షన్ ఇస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







