లేబర్‌ చట్టం ఉల్లంఘన: 136 వలసదారుల అరెస్ట్‌

- November 30, 2018 , by Maagulf
లేబర్‌ చట్టం ఉల్లంఘన: 136 వలసదారుల అరెస్ట్‌

 మస్కట్‌: నార్త్‌ బతినాలో మొత్తం 136 మంది వలస కార్మికుల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. ఆన్‌లైన్‌ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించడం జరిగింది. లేబర్‌ చట్టం ఉల్లంఘన అలాగే రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనకు పాల్పడినందుకుగాను వీరిని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ తెలిపింది. దేశంలో భద్రతా కారణాల రీత్యా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఈ క్రమంలో ఉల్లంఘనలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com