తెలంగాణ:కాంగ్రెస్ కు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్
- December 01, 2018
తెలంగాణ:ఎన్నికల వేళ వ్యూహాలకు పదును పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించిన కాంగ్రెస్…తాజాగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌ను తెరపైకి తెచ్చింది. ముస్లీంలకు మరింత దగ్గరవ్వడమే లక్ష్యంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను మరో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. అంతే కాదు ముస్లీం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో అజ్జూబాయ్తో ప్రచారం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
ఇప్పటికే సోనియా, రాహుల్, చంద్రబాబు, ఇతర మహాకూటమి నేతలు ప్రచారంలో దుమ్ము రేపుతున్నారు. ప్రతీదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు కాంగ్రెస్. ఇందులో భాగంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును సృష్టించింది. పోలింగ్ ముహూర్తం దగ్గర పడుతున్నసమయంలో ఉన్నట్టుండి వర్కింగ్ ప్రెసిడెంట్ అజార్‌ను నియమించడం కాంగ్రెస్ వ్యూహంలో భాగమే అంటున్నారు ఆపార్టీ నేతలు.
ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ముస్లీంల ఓటు బ్యాంక్ కీలకంగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తితో ముందుకెళుతున్న పరిస్థితి. ఇందులో భాగంగా ఎంఐఎం పాతబస్తికే పరిమితమైంది. ఇదంతా గమనిస్తున్న కాంగ్రెస్. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా హైద్రాబాద్ ముస్లీంలకు ఐకాన్‌గా ఉన్న అజారుద్దీన్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హుటా హుటిన నియమించింది.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడమే ఆలస్యం టీఆర్ఎస్పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు అజారుద్దిన్. ముస్లింల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమి లేదని…12 శాతం రిజర్వేషన్ల విషయంలో మోసం చేశారని విమర్శించారు. షాదీ ముబారక్ పథకానికి మైనారిటీ ఫండ్స్ నుంచే నిధులు కేటాయిస్తున్నారని…కొత్తగా కేసీఆర్ చేసిందేమి లేదని ఆరోపించారు అజారుద్దీన్.
మరోవైపు రంగంలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మైనార్టీ నేతల మద్దతును తెర వెనుక కూడగడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ మైనార్టీలనును పార్టీకి మరింత దగ్గరకు చేసేందుకే అజారుద్దిన్‌ను ట్రంప్ కార్డుగా ఉపయోగించినట్లు సమాచారం. మరి ఇది ఏమేరకు వర్కైట్ అవుతుందో చూడాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







