47వ నేషనల్‌ డే: యూఏఈ ఎయిర్‌ లైన్స్‌ ఫ్లై పాస్ట్‌

- December 01, 2018 , by Maagulf
47వ నేషనల్‌ డే: యూఏఈ ఎయిర్‌ లైన్స్‌ ఫ్లై పాస్ట్‌

యూ.ఏ.ఈ:ఎమిరేట్స్‌, ఎతిహాద్‌, ఫ్లై దుబాయ్‌, ఎయిర్‌ అరేబియా.. ఫ్లై పాస్ట్‌ని నిర్వహించనున్నాయి. యూఏఈ 47వ నేషనల్‌ డే, ఇయర్‌ ఆఫ్‌ జాయెద్‌ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టాలని ఆయా సంస్థలు నిర్వహించాయి. మధ్యాహ్నం 1 గంటల నుంచి ఈ ఫ్లై పాస్ట్‌ జరుగుతుంది. అల్‌ ఫుర్సాన్‌ ఏరోబాటిక్‌ డిస్‌ప్లే టీమ్‌తో కలిసి ఈ విన్యాసాలు వుంటాయి. ఫ్లై పాస్ట్‌ రేపు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సమయంలో దర్శనమివ్వనున్నాయి. రస్‌ అల్‌ ఖైమాలో 1.40 నిమిషాలకు, ఉమ్‌ అల్‌ కువైన్‌లో 1.48 నిమిషాలకు, షార్జా కోర్నిచ్‌లో 1.52 నిమిషాలకు, దుబాయ్‌ జుమైరా1లో 1.55 నిమిషాలకు, దుబాయ్‌ - పామ్‌ జుమైరా / అట్లాంటిస్‌లో 1.58 నిమిషాలకు, అబుదాబీ - ఘాతూత్‌లో 2.03 నిమిషాలకు, అబుదాబీ - లార్వ్‌లో 2.12 నిమిషాలకు, అబుదాబీ కోర్నిచ్‌లో 2.15 నిమిషాలకు, అబుదాబీ - షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌ వద్ద 2.25 నిమిషాలకు ఈ విన్యాసాల్ని చూసే అవకాశం వుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com