సౌదీపై హౌతి మిస్సైల్ ఎటాక్: ఇద్దరికి గాయాలు
- December 01, 2018
జెడ్డా: సౌదీ అరేబియా సౌత్ వెస్టర్న్ ప్రాంతంలో మిస్సైల్ దాడి కారణంగా ఇద్దరికి గాయాలయ్యాయి. యెమెన్‌లోని హౌతీ తీవ్రవాదులు ఈ మిస్సైల్‌ని సంధించారు. సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిథి కల్నల్ యాహ్యా అబ్దుల్లా అల్ కమ్తాని మాట్లాడుతూ, సంఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకున్నాయనీ, మిస్సైల్ దాడి ఓ ఇంటి మీద జరిగిందని చెప్పారు. ఈ ఘటనలో యెమెన్‌కి చెందిన మహిళ, సౌదీ జాతీయుడు గాయపడ్డారని తెలిపారు. యెమెన్ నుంచి హౌతీ తీవ్రవాదులు, సౌదీలోని ప్రముఖ నగరాలు, ముఖ్యంగా జనం ఎక్కువగా వుండే ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్ దాడికి పాల్పడుతుండడం జరుగుతోంది. అయితే వీటిని ఎప్పటికప్పుడు అత్యంత చాకచక్యంగా సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేస్తూనే వున్నాయి. చాలా అరుదుగా మాత్రమే హౌతీ తీవ్రవాదుల మిస్సైల్స్, లక్ష్యాన్ని తాకుతున్నాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!