కలిసి ఉగ్రవాదాన్ని అంతమొందిద్దాం : మోదీ
- December 02, 2018
జీ-20 సదస్సులో పాల్గొనేందుకు అర్జెంటీనా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్, ఈయూ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లౌడీ జంకర్, జర్మన్ ఛాన్సలర్ అంజెలా మార్కెల్‌తో పాటు పలువురు ఈయూ నేతలతో సమావేశమయ్యారు. భారత్-ఈయూ మధ్య సత్సంబంధాల బలోపేతం, సమన్వయంతో ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా అణచివేయడం వంటి విషయాలపై వారు చర్చించారు. ఈ ఏడాది నవంబరులో బ్రస్సేల్స్‌లో జరిగిన ఓ సమావేశంలోనూ పాల్గొన్న భారత్-ఈయూ.. ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సమాజాన్ని తప్పుదోవ పట్టించే అంశాలపై చర్చించి, వాటిని అంతమొందించే విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చాయి.
అర్జెంటీనాలో మోదీ చర్చల గురించి భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీటర్‌లో వివరాలు తెలిపారు. ఈ సమావేశం భారత్-ఈయూ మధ్య సత్సంబంధాల బలోపేతం, ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి తీసుకోవాల్సి చర్యలు వంటి అంశాలపై, ఇందు కోసం దేశాల మధ్య సత్సంబంధాలు ఉండాల్సిన ప్రాముఖ్యతపై చర్చించారని చెప్పారు. తన పర్యటనలో భాగంగా మోదీ... నెదర్లాండ్ ప్రధాని మార్క్ రుట్టె, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో కూడా సమావేశమయ్యారు. ఆయన ఇతర దేశాల అగ్రనేతలతోనూ ప్రత్యేకంగా భేటీ అవుతారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..