బియ్యం నీటిలో దాల్చిన చెక్క పొడి కలిపి సేవిస్తే..
- December 03, 2018
దాల్చిన చెక్కను తరచుగా వంటకాల్లో వాడుతుంటారు. దాల్చిన చెక్క వలన వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. ఇలాంటి దాల్చిన చెక్కను వంటకాల్లోకే కాదు పలురకాల అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
1. సాధారణంగా మహిళలు రుతు సమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే.. బియ్యం కడిగిన నీటిలో 3 స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
2. ఒక్కోసారి కొందరికి గుండె పట్టేసినట్టుగా ఉంటుంది.. అలాంటప్పుడు దాల్చిన చెక్కను చూర్ణం చేసుకుని అందులో కొద్దిగా యాలకుల పొడి కలిపి నీటిలో మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో తీసుకుంటే గుండె బిగపట్టడం తగ్గుతుంది.
3. దాల్చిన చెక్కను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా నీరు కలిపి నుదిటిపై రాసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే.. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
4. కాస్తంత తేనెను వేడిచేసి అందులో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి రాసుకున్నా చర్మం దురదలు, ఎగ్జిమా, పొక్కులు వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులు దరిచేరవు.
5. దాల్చిన చెక్క నూనెను చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా గ్లాస్ పాలలో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి కొద్దిగా చక్కెర వేసి తీసుకుంటే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్