ఒమన్‌లో సందడి చేయనున్న షారుక్
- December 03, 2018
ఒమన్:బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్, ఒమన్‌లో సందడి చేయనున్నాడు. టిఎఫ్ఎం, వివోఎక్స్ సినిమాస్, షారుక్త్ బిగ్గెస్ట్ ఈవెంట్‌ని ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్లో అభిమానులు, షారుక్‌ని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం షారుక్, ఒమన్ వస్తున్నారు. షారుక్ కొత్త సినిమా 'జీరో' డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెల్సిందే. డిసెంబర్ 7న సిటీ సెంటర్ మస్కట్‌లో షారుక్ సందడి చేస్తాడు. సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఆ రోజు జరుగుతుంది. జీరో సినిమా విషయానికొస్తే, ఇందులో షారుక్ సరసన బాలీవుడ్ అందాల భామలు అనుష్క శర్మ, కత్రినాకైఫ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షారుక్ ఈ సినిమాలో 'షార్ట్ మ్యాన్'గా కన్పించనున్న సంగతి తెల్సిందే. హైట్‌లో పొట్టి అయినా, యాటిట్యూడ్‌లో చాలా గట్టి వ్యక్తిగా షారుక్ ఈ సినిమాలో సత్తా చాటబోతున్నాడు. ఆనంద్ ఎల్ రాయ్ ఈ చిత్రానికి దర్శకుడు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







