ఒక్కనెలలో మార్కెట్లకు విదేశీ పెట్టుబడులు రూ.12.260 కోట్లు
- December 03, 2018
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు నవంబరు ఒక్కమాసంలోనే భారతీయ మూలధన మార్కెట్లకు 12,260 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. గడచిన పది నెలల్లో ఇదే గరిష్టస్థాయి పెట్టుబడులుగా నిపుణులు చెపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురుదరలు పతనం అయినప్పటినుంచి ఇన్వెస్టర్లు భారత్‌మార్కెట్లపై ఎక్కువ దృష్టిపెట్టారు. అయితే ఇన్వెస్టర్లు డెట్ ఈక్విటీ మార్కెట్లనుంచి సుమారు 60వేల కోట్లు వెనక్కితీసుకున్నారు. గడచిన రెండునెలల్లో ఇంతభారీ మొత్తం విత్‌డ్రాచేయడం ఇదే మొదటిసారి. అంతకుముందు విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 7300 కోట్లు పెట్టుబడులు పెట్టారు. తాజా గణాంకాలనుచూస్తే విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు నికరంగా 6913 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లలోను, 5347 కోట్లు డెట్ మార్కెట్లలోపు పెట్టుబడులు పెట్టారు. రూ.12,260 కోట్లు మొత్తంగాపెట్టుబడులు పెట్టారు. జనవరి నెల తర్వాత ఇదే గరిష్టస్థాయి మొత్తంగా చెపుతున్నారు. విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు జనవరిలోనే 22,240 కోట్ల పెట్టుబడులుపెట్టారు. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు జనవరి మార్చి, జులై ఆగస్టు నెలలు మినహాయిస్తే ఈ నాలుగునెలల్లోను విదేశీ ఇన్వెస్టర్లు 32,వేల కోట్లు పెట్టుబడులుపెట్టారు.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సెప్టెంబరు చివరినుంచి భారీ పెట్టుబడులుపెడుతున్నారు. మొత్తగాచూస్తే 21 వేల కోట్లుపెట్టుబడులుపెట్టారు. అక్టోబరునెలలో కూడా 38,900 కోట్లు విత్‌డ్రాచేసుకున్నారు. అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచడం, ముడిచమురుధరలుపెరగడం, రూపాయి క్షీణించడం, కరెంటుఖాతాలోటు భారీ లోటుతో నడవడం అనిశ్చితి పెరగడం వంటివి కారణాలుగా చెపుతున్నారు.
విదేశీపోర్టుఫోలియో ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులు భారత్ మార్కెట్లనుంచి ఎక్కువగా సెప్టెంబరు, అక్టోబరునెలల్లోనే ఎక్కువ విత్‌డ్రాచేసారు. ఈ ఏడాది ఇ్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లురూ.88 వేల కోట్లు మార్కెట్లనుంచి వెనక్కితీసుకున్నారు. రూ.35వేల కోట్లు ఈక్విటీ మార్కెట్లనుంచి రూ.53వేల కోట్లు డెట్‌మార్కెట్లనుంచి విత్‌డ్రాచేసారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







