యూఏఈ వీసా ఆమ్నెస్టీ నెల రోజుల పొడిగింపు

- December 03, 2018 , by Maagulf
యూఏఈ వీసా ఆమ్నెస్టీ నెల రోజుల పొడిగింపు

యూఏఈ నేషనల్‌ డే సందర్భంగా మ్నెస్టీ స్కీమ్‌ని నెల రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఫెడరల్‌ అథారిటీ ఫర్‌ ఐడెంటిటీ అండ్‌ సిటిజన్‌షిప్‌ (ఎఫ్‌ఎఐసి) సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో డిసెంబర్‌ 31 వరకు అమ్నెస్టీ పొడిగించినట్లయ్యింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి సమస్యలు ఎదుర్కొంటున్న వలసదారులకు ఆమ్నెస్టీ స్కీమ్‌ ఎంత ఊరటనిస్తోంది. గతంలో ఓ సారి నెల రోజులపాటు పొడిగింపబడిన ఈ స్కీమ్‌, తాజాగా మరో నెల పొడిగించడంతో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పొడిగింపు నిర్ణయం పట్ల వలసదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎఫ్‌ఎఐసి పేర్కొంది. 'మాడిఫైయింగ్‌ యువర్‌ స్టేటస్‌' పేరుతో మూడు నెలలపాటు తొలుత ఆమ్నెస్టీని ప్రకటించారు. ఆగప్ట్‌ 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు దీన్ని తొలుత నిర్ణయించారు. ఆ తర్వాత నవంబర్‌ 30 వరకూ పొడిగించగా, ఇప్పుడు అది డిసెంబర్‌ 31 వరకు పొడిగించడమయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com