డిసెంబర్ 7న ఎన్నికలు.. ఆ రోజుకు మరో ప్రత్యేకత ఏంటంటే..
- December 04, 2018
డిసెంబర్ 7వ తేదీ అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆరోజు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తమ సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. పోలింగ్ రోజు శుక్రవారం కావడం ఆతరువాత రెండవ శనివారం,ఆదివారం సైతం తోడవడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అయితే కొంతమంది ఓటర్లు గురువారం రాత్రికే తమ సొంత ఊర్లకు పయనమవుతున్నట్టు సమాచారం. ఎందుకంటే పోలింగ్ రోజున ప్రయాణం చెయ్యాలంటే కుదరని పని. అందువల్ల ఆరవ తేదీ రాత్రికే పట్టణాల నుంచి పల్లెలకు పోతున్నారు. సాధారణంగా నిత్యం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 5 లక్షలకు పైనే ఉంటారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రతి రోజు 1.5 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తుండగా, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి మరో 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. వరుస సెలవుల్లో 50 వేల మంది అదనంగా ప్రయాణాలు సాగిస్తారు.
ఇక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరం నుంచి వేల సంఖ్యలో అదనంగా ప్రజలు అటు బస్సులు, ఇటు రైళ్లలో ప్రయాణం చేస్తారని ఎన్నికల కమిషన్ అంచనా వేస్తోంది. ఇప్పటికే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇదిలావుంటే ఈనెల 7వ తేదికి మరో ప్రత్యేకత ఉంది. అదే రోజు 6 సినిమాలు విడుదల అవుతున్నాయి. భైరవగీత, కవచం, నెక్ట్స్ ఏంటీ, సువర్ణ సుందరి, శుభలేఖ+లు, సుబ్రహ్మణ్యపురం తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వరుస సెలవులు కారణంగా ఈ సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే పోలింగ్ రోజు మినహాయిస్తే రెండురోజులూ ఈ సినిమాలకు కలెక్షన్లు భారీగానే ఉంటాయని నిర్మాతలు అంచనా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది అభిప్రాయం మరోలా ఉంది. ఎన్నికల సందర్బంగా వరుస సెలవులు ఉండటంతో ప్రజలు స్వస్థలాలకు వెళతారు కాబట్టి.. ఆ మూడు రోజులు కుటుంబసభ్యులతో హాయిగా గడపాలని అనుకుంటారు అని అంటున్నారు. మరి ప్రజలు ఎంటర్‌టైన్‌మెంటు కోసం సినిమాలకు వెళతారా.. మూడురోజులు సెలవులు వచ్చాయి కాబట్టి ఓటు వేసి హాయిగా కుటుంబసభ్యులతో వుండాలని కోరుకుంటారో చూడాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







