నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌: సిద్ధమవుతోన్న ఎస్పైర్‌ జోన్‌

- December 04, 2018 , by Maagulf
నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌: సిద్ధమవుతోన్న ఎస్పైర్‌ జోన్‌

దోహా: ఎస్పైర్‌ జోన్‌ ఫౌండేషన్‌, ఈ ఏడాది ఖతార్‌ నేషనల్‌ డే (క్యూఎన్‌డి) సెలబ్రేషన్స్‌కి సిద్ధమయ్యింది. వారం రోజులపాటు జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 13 నుంచి 18 వరకు ఈ వేడుకలు జరుగుతాయి. ఎజెడ్‌ఎఫ్‌ పిఆర్‌ మరియు కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ నాజర్‌ అబ్దుల్లా అల్‌ హజ్రి మాట్లాడుతూ, లాయల్టీ, యూనిటీ మరియు ఖతార్‌ నేషనల్‌ ఐడెంటిటీ బిల్డ్‌ ప్రైడ్‌ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు తెలిపారు. అల్‌ అదామ్‌ ఫ్లాగ్‌ రిలే గ్రాండ్‌ ఫినాలె డిసెంబర్‌ 13న జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వేడుకలు మొదలవుతాయి. సంప్రదాయ అర్ధా స్వార్డ్‌ డాన్స్‌ ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణ కానుంది. వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలతో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తారు. కుకింగ్‌ డెమోనిస్ట్రేషన్స్‌, పాప్‌ అప్‌ ఫొటో స్టూడియోస్‌, హెన్నా డిజైన్స్‌, పిల్లలకు ఆటపాటలు.. ఇంకా చాలా చాలా కార్యక్రమాల్ని పొందుపర్చారు. మిలిటరీ పెరేడ్‌ ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణ అని నిర్వాహకులు చెబుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com