శ్రీలంకలో ముదిరిన రాజకీయ సంక్షోభం
- December 04, 2018
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రతిష్ఠించిన ప్రధాన మంత్రి మహింద రాజపక్సకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రధానమంత్రి హోదాలో రాజపక్స ఎలాంటి నిర్ణయాలు తీసుకో వద్దని కోర్టు ఆదేశించింది.
అధ్యక్షుడు సిరిసేన, అక్టోబర్ 26న రణిల్ విక్రమసింఘేను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించి, రాజపక్సను కూర్చోబెట్టారు. అనంతరం, రాజపక్సకు తగిన సంఖ్యలో ఎంపీల మద్దతు లభించే అవకాశం లేకపోవడంతో పార్లమెంటును రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 122 మంది చట్టసభ్యులు, కోర్ట్ ఆఫ్ అపీల్‌ను ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు, రాజపక్స-ఆయన మంత్రివర్గం తమ పదవులకు సంబంధించి ఎలాంటి విధులు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







