దిగ్విజయంగా జీశాట్ -11 ప్రయోగం

- December 05, 2018 , by Maagulf
దిగ్విజయంగా జీశాట్ -11 ప్రయోగం

జీశాట్ -11 ప్రయోగం విజయవంతమైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. బిగ్‌ బర్డ్‌గా పిలుచుకునే ఈ ఉపగ్రహం తయారీకి రూ.600 కోట్లు ఇస్రో వెచ్చించింది.డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా దేశమంతటా సెకనుకు 100 జీబీ డేటా అందించేందుకు నాలుగు జీశాట్‌-11 ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించగా.. తాజా ప్రయోగం మూడోది. ఈ శాటిలైట్ 15 ఏళ్లపాటు సేవలు అందించనుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సమాచారం అందించనున్న జీశాట్‌-11 శాటిలైట్ భారత్‌కు విలువైన అంతరిక్ష ఆస్తిగా నిలవనుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com