ఆదంబాక్కంలోని లేడీస్‌ హాస్టల్‌లో ఘోర అకృత్యం

- December 05, 2018 , by Maagulf
ఆదంబాక్కంలోని లేడీస్‌ హాస్టల్‌లో ఘోర అకృత్యం

చెన్నై: విద్య, ఉపాధి కోసం నగరానికి వచ్చి హాస్టళ్లలో బస చేసే అమ్మాయిలు ఎంత జాగృతగా, అప్రమత్తంగా ఉండాలో తెలిపే ఉదంతమిది. ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యాన హాస్టళ్లను నడుపుతున్నారని అనేక ఫిర్యాదులొస్తున్నా అధికారులు చూపుతున్న నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమిది.

స్థానిక ఆదంబాక్కంలో నడుపుతున్న ఒక లేడీస్‌ హాస్టల్‌లోని పడక గదులు, బాత్రూమ్‌ల్లో రహస్య కెమెరాలు ఉంచిన విషయం వెలుగుచూసింది. ఆ హాస్టల్‌లో బస చేస్తున్న అమ్మాయిలే రహస్య కెమెరాలను గుర్తించి, హాస్టల్‌ ముసుగులో జరుగుతున్న ఆకృత్యాలను బయటపెట్టారు. ఈ వ్యవహారంలో హాస్టల్‌ యజమాని సంజీవి (48)ని పోలీసులు అరెస్టు చేశారు. ఆదంబాక్కంలో ఒక ఇంటిని అద్దె తీసుకుని, రెండు నెలల క్రితమే ఈ హాస్టల్‌ను ప్రారంభించారు. ఏడుగురు ఐటీ ఉద్యోగినులు అక్కడ బస చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొన్ని రోజుల నుంచి మరమ్మతులు పేరుతో హాస్టల్‌ భవనంలో కొన్ని మార్పులు చేపట్టారు. సంపత్‌రాజ్‌ చర్యలు అనుమానాస్పదంగా ఉండడంతో హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉండవచ్చని అమ్మాయిలకు సందేహం వచ్చింది. వెంటనే మొబైల్‌ టెక్నాలజీ సాయంతో ఒక యాప్‌ని ఉపయోగించి తనిఖీ చేయగా, హాస్టల్‌ భవనంలోని పడక గదులు, బ్రాతూమ్‌లు, బట్టలు తగిలించుకునే హ్యాంగర్లు, ఇతర ప్రదేశాల్లో రహస్య కెమెరాలు ఉన్నట్లు కనుగొన్నారు.

పెద్ద సంఖ్యలో కెమెరాలు పట్టుబడడంతో దిగ్ర్భాంతి చెందిన అమ్మాయిలు వెంటనే ఆదంబాక్కం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హాస్టల్‌ యజమాని సంపత్‌రాజ్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద 16 సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సంజీవిని కోర్టులో హాజరుపరుచగా, 18వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com