సినీనటి వనిత అరెస్ట్..!
- December 08, 2018
చెన్నై:తండ్రి ఇంటిని షూటింగులకు వాడుకుంటూ.. ఎంత చెప్పినా ఖాళీచేయకుండా.. నటి వనిత చేసిన హల్చల్ అంత ఇంతా కాదు. రెండు నెలల కిందట ఇదే విషయమై అరెస్టయింది వనిత. తాజాగా మరోసారి నటుడు విజయ కుమార్ కొడుకు.. వనితపై ఫిర్యాదు చేశారు. దాంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చెన్నై స్థానిక ఆలపాక్కం, అష్టలక్ష్మీ నగర్ 19వ వీధిలో పెద్ద బంగ్లా ఉంది. దాన్ని విజయకుమార్ షూటింగ్‌లకు ఇచ్చేవారు. అలా విజయకుమార్ కూతురు, వనిత ఆ మధ్య షూటింగ్‌కని చెప్పి ఆ ఇంట్లోనే ఉండిపోయింది. కొద్దిరోజులతరువాత విజయకుమార్ వనితను ఇల్లు కాళీ చేయమని కోరాడు.
దానికి ఆమె ససేమీరా అంది.చేసేదేమి లేక మధురవాయిల్ పొలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు విజయకుమార్. అయితే పోలీసులు, బంధువులు ఎవ్వరూ చెప్పినా ఆమె వినలేదు. దాంతో బలవంతంగా ఆమెను అదుపులోకి తీసుకుని ఆ ఇంటిని ఖాళీ చేయించారు పోలీసులు. ఈ క్రమంలో వనిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆమె అభ్యర్ధనను సమర్ధించింది. అంతేకాదు పోలీసులు వనితకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో రెండు రోజుల కిందట వనిత ఆ ఇంట్లోకి తిరిగి చేరింది. ఈ పరిణామం విజయకుమార్ కొడుక్కు రుచించలేదు. ఇంటిని ఖాళీ చేయవలసిందిగా వనితపై పోలీసులకు ఫిర్యాదు చేశాడతను. దాంతో పోలీసులు వనితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







