గల్ఫ్‌ కష్టాలు - ప్రభుత్వాలు , పార్టీల హామీలు

- December 08, 2018 , by Maagulf
గల్ఫ్‌ కష్టాలు - ప్రభుత్వాలు , పార్టీల హామీలు

గల్ఫ్‌ కష్టాలు - ప్రభుత్వాలు , పార్టీల హామీలు
- (ఎన్‌ఆర్‌ఐ)నాట్‌ రిక్వైర్డ్‌ ఇండియన్‌ గా గుర్తించబడుతున్న గల్ఫ్‌ అన్న !!
- ఇండియా ఈస్‌ యంగ్‌' యంగ్‌ కాబట్టి వారిని ఇండియా అభివృద్ధి కి తోడ్పడేలా చేసుకోవాలి - బయట దేశాల సేవలకు కాదు కదా !!
- కేంద్రం హామీ ఇచ్చిన విదేశీ సంపర్క్‌ ' భవన నిర్మాణం భవనం ద్వారా కార్య క్రమాలు ఎపుడు?

- 800 పోస్ట్‌ఆఫీసులు పాస్‌పోర్ట్‌ కేంద్రాలు గా మార్చుట ఎక్కడిదాకా వచ్చింది?
ఇతర దేశాల (సౌదీ ) కౌన్సిలేట్‌ లు 
హైదరాబాద్‌ కి ఎపుడు వస్తున్నాయి
- 27 జులై,2016 రౌండ్‌ టేబుల్‌ సమావేశం,
- 13 మే,2017 విదేశీ సంపర్క్‌ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందా?
తప్పుడు ఏజెంట్ల కు శిక్ష అమలైందా..!
- కరువు, పేదరికం,నిరక్షరాస్యత ,నిరుద్యోగం,, వీసా కొనుట ,అనుభవం, నైపుణ్యం లేకున్నా డబ్బుతో సంపాదించొచ్చు అనే ఆలోచన కార్మికులను బాధితులుగా మారుస్తుంది.
- సరి అయినా విద్య ,అనుభవం, నైపుణ్యం తో ఇంటర్వ్యూ పాస్‌అయ్యి ఉద్యోగం తెచ్చుకుంటే- ప్రయాణ, మెడికల్‌, వీసా, భీమా ,భోజనం, నివాససదుపాయాలు సరిగ్గా ఉంటాయి
- ఏజెంట్‌కు రూ.20000, మెడికల్‌ కి ఖర్చు చేయాలి కానీ, కార్మికుడు పెట్టేది సుమారు లక్ష ఇరవై వేలు!
సురక్షిత వలసలకు ఎం చేయొచ్చు?
- ఇతర దేశాలకు (టోఫెల్‌,ఐఈఎల్‌టీఎస్‌) వ్యక్తిగత వారి పూచి అవసరం. గల్ఫ్‌ కి కూడా కొంచెం ఆంగ్లం , కొంచెం అరబ్బీ , సూచనలు తెలిపి పంపితే నే బాగుంటది.
- కార్మికులకు గల్ఫ్‌ దేశాల లో పలు రకాల పర్మిషన్స్‌ లు ఉంటాయి , అట్టేస్తేషన్స్‌ అని , ట్రాంశ్లేషన్స్‌ అని ఉంటాయి, అదే మన దగ్గరి నుండి బయటకి వెళ్లే
- వారికి అంతే ధాటి గా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ ల రిజిస్ట్రేషన్‌ , లాభాల లో ఉన్నదా లేదా , ఇచ్చే వసతులు ఏమి అని మన రాష్ట్రము తరపున పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇచ్చే ముందే విచారణ చేసే వెసులు బాటు ఇస్తే వలసలను ఆపొచ్చు.
ఉపాధికోసంవెళ్లేవారివివరాలుతప్పకసేకరించాలి.
- ఉద్యోగ సమాచారాలను ప్రభుత్వ పరంగా తెలిపే ప్రయత్నం చేయాలి.
- విదేశాలలో కార్మికులకు ఉపయోగపడే ప్రతికార్యాలయం వివరాలను, వాటి సేవలను ,ఉచితసేవలు అందిచే సంస్థల వివరాలను అందరికి తెల్సే టట్టు ప్రాంతీయభాషలలో పొందుపర్చాలి.
- ఎంబసీల స్టాఫ్‌ 20 ఏండ్ల నాటి సంఖ్యనే! జనాభాకు అనుగుణంగాపెంచాలి.
- కువైట్‌ ప్రభుత్వం 3000 బోగస్‌ వీసా లో ఉన్న వారిని తిప్పిపంపుతూ,
తప్పుచేసినవారికి శిక్షజారీచేసింది. ఒక్కవీసాఖర్చు రూ. 3,65,000 ,
ఈఖర్చుతో ఇండియాలోనే మంచివ్యాపారం చేస్కోవచ్చు
ఇంజినీర్లకు ఎన్బీఏ గుర్తింపు కష్టాలు ఉన్నాయి.
- ఇమి్మగషన్‌ ఒకసారి రిజిస్టర్‌ చేసి పంపినాక తర్వాత అంతగా చెకింగ్‌ లేదు అందువల్ల కూడా తిప్పలు వొచ్చినాయి. ఇపుడు కొత్తగా సవరించినారు. మంచిగా జరుగొచ్చు.
ఇండియా లో ఎన్‌ఆర్‌ఐ లకు సహాయం:
- రాష్ట్రం లో ఎన్‌ఆర్‌ఐ పేద కుటుంబాలకు విద్య వైద్య , పునరావాస , నైపుణ్యత పెంచే శిక్షణ చనిపోయిన కుటుంబాలకు అత్యవసరం గా ఆర్థిక సహాయం, రక్షణ ఇవ్వాలి .
- రియల్‌ ఎస్టేట్‌ లో కూడా ఎన్‌ఆర్‌ఐ లకు స్థానిక ప్రైవేట్‌ బిల్డర్ల వల్ల కష్టాలు ఎక్కువ గా ఉన్నాయి.ప్రభుత్వాలు కొన్ని స్థలాలు చూపి సహకరించాలి.
- గల్ఫ్‌ లో పేద రోగులకు , బాధితులకు , భోజనం , వసతి , ప్రయాణ ఖర్చు భరిస్తూ , అరబీ వొచ్చి స్థానికం గ అన్ని కార్యాలయాల లో పనులు చేసి పెట్టి , న్యాయ సహకారం చేసే వారిని ప్రోత్సహించాలి.
- గల్ఫ్‌ లో వారికీ టెక్నికల్‌ కష్టాలను అరబీ భాష లో రాసిన పేపర్ల ను తెచ్చి వీరికి ఇచ్చేలాగా లేదా కంప్యూటర్‌ ల లో చెక్‌ చేసితెలిపే సౌకర్యం, రుసుములు కట్టే విధానం, అవసరం ఉంటె సేవలు అందించేలాగా ప్రభుత్వం అత్యవసర చర్య తీసుకోవాలి .
- 24/7 హెల్ప్‌ లైన్‌ సౌకర్యం అందుబాటులో రావాలి.
8 ఫిర్యాదులు చేయాలి అనుకున్న వారి వివరాలను గోప్యంగా ఉంచాలి.
- గల్ఫ్‌ కుటుంబాలకు కార్మికులకు జీవిత , ప్రమాద , ఆరోగ్య బీమా కల్పించాలి.
- బాధితులు స్థానిక జిల్లా అధికార్లకు ఇమెయిల్‌ పెడితే ఏ-పిటిషన్‌ గ స్వీకరించి, సహకరించాలి.
- ప్రజావాణి లో అవకాశం ఇవ్వాలి.
ఎaసaస వెబ్‌ సైట్‌:
 ఫాలో అప్‌ కి అవకాశం లేదు.
- అమెరికాలోని విద్యార్హుల ను ఉద్దేశించి చేసింది.
- ఫిర్యాదు సరిగ్గా చేస్తే గంట పడుతుంది.
- ఆధార్‌ నంబరు, ఇండియా ఫోన్‌ నంబరు తప్పని సరి.! ఇది అందరి దగ్గర ఉండదు. నప్పుడు వేరే ఏ ప్రూఫ్‌ ఐన ఓకే చేయవోయుచు కదా !
- టైపింగ్‌ లో స్పెషల్‌ క్యారెక్టర్‌ లు తీసుకోదు .
- మొబైల్‌ ఫ్రెండ్లీ గా కూడా లేదు.
- సవరణ అవసరం.
- పాస్పోర్ట్‌ లు ఇతర డాక్యుమెంట్స్‌ కార్మికుని దగ్గరనే ఉండాలి.

 

--గంగుల మురళీధర్ రెడ్డి (కువైట్ )

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com