పోలీసుల అదుపులో ‘గోపిక’ నటి.. వజ్రాల వ్యాపారి..

- December 09, 2018 , by Maagulf
పోలీసుల అదుపులో ‘గోపిక’ నటి.. వజ్రాల వ్యాపారి..

ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజేశ్వర్‌ ఉడా హత్య కేసులో పలువురు సినీ నటులను విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రాజాకీయ నాయకుడు సచిన్ పవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా సినీనటి దెవోలినా భట్టాచార్యను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన రాజేశ్వర్‌ ఉడా కాగా గతవారం ఇంటినుంచి కనిపించకుండా పోయారు. దాంతో కుటుంబసభ్యులు ఎంత వెతికినా లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు రాయ్‌గఢ్‌ జిల్లాలోని అడవుల్లో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది.

ఈ మృతదేహాన్ని అదృశ్యమైన రాజేశ్వర్‌ ఉడాగా గుర్తించారు. రాజేశ్వర్‌ కాల్‌డేటా ఆధారంగా అదృశ్యమవడానికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడన్న అంశాలపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే దెవోలినా భట్టాచార్యను విచారించినట్లు తెలుస్తోంది. అయితే రాజేశ్వర్‌.. పలు వేడుకలకు సినీనటులను తీసుకువచ్చి డ్యాన్స్ లు వేయించేవాడని పొలిసు విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దెవోలినా భట్టాచార్యను విచారిస్తున్నారు. ఇదిలావుంటే సీరియల్‌ లలో తన నటనకు గానూ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. తెలుగులో ‘గోపిక’ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు చేరువైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com