ఉత్కంఠను రేపుతున్న 'అంతరిక్షం' ట్రైలర్
- December 09, 2018
వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అంతరిక్షం 9000 కెఎంపిహెచ్ ట్రైలర్ ఏఎంబి సూపర్ ప్లెక్స్ వేదికగా ఇందాకా విడుదలైంది. ఘాజీతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సంకల్ప్ రెడ్డి ఈసారి అంతకన్నా బలమైన సంకల్పంతో ఇది రూపొందించినట్టు కనిపిస్తోంది. ఇండియన్ స్పేస్ సెంటర్ లో పనిచేస్తూ రాజీ పడని తన వ్యక్తిత్వం కారణంగా అందులో నుంచి బయటికి వచ్చేస్తాడు దేవ్(వరుణ్ తేజ్). కానీ ఓసారి శాటిలైట్ ప్రయోగం వికటించడంతో మొత్తం సమాచార వ్యవస్థ డేంజర్ లో పడుతుంది.
దాన్ని పరిష్కరించడం ఒక్క దేవ్ వల్లే అవుతుందని గుర్తించిన స్పేస్ సెంటర్ అతన్ని వెనక్కు వచ్చేలా చేయడంలో అతని ఫ్రెండ్(అవసరాల శ్రీనివాస్)సహాయం తీసుకుంటుంది. దేవ్ వచ్చి దాన్ని పరిష్కరించేందుకు నడుం బిగిస్తాడు. కానీ అదంత సులభంగా ఉండదు. టీమ్ ని తీసుకుని రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధ పడతాడు. అక్కడికి వెళ్ళాక అసలు సవాళ్లు ఎదురవుతాయి. దేశం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దేవ్ ఎలా నిలబెట్టుకున్నాడు అనేదే అంతరిక్షం 9000 కెఎంపిహెచ్
కథలో మరీ నవ్యత్వం అనిపించకపోయినా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఎమోషన్ ని మిస్ కాకుండానే దేశ రక్షణకు సంబంధించిన ఇలాంటి సున్నితమైన అంశాన్ని మరోసారి ఎంచుకున్నందుకు సంకల్ప్ రెడ్డిని మనస్పూర్తిగా అభినందించవచ్చు. జ్ఞాన శేఖర్ కెమెరా నైపుణ్యం రెండు నిమిషాలలోనే ఇంత అమోఘంగా అనిపిస్తే రేపు సినిమాలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఎలివేట్ అయ్యింది.
రాజీవ్ రాజశేఖరం కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ కు టాప్ స్టాండర్డ్ అనే మాట చిన్నదే. మొత్తానికి తెలుగు ప్రేక్షకులు ఇప్పటిదాకా చవి చూడని సరికొత్త అనుభూతిని సంకల్ప్ రెడ్డి కలిగించబోతున్నాడన్న గ్యారెంటీ ట్రైలర్ లో దక్కింది వరుణ్ తేజ్ దేవ్ గా యాప్ట్ గా ఉండగా లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి. రెహమాన్, అవసరాల శ్రీనివాస్, సత్య దేవ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతరిక్షం డిసెంబర్ 21నే విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







