రిస్క్ తీసుకున్న హీరో కల్యాణ్‌రామ్
- December 09, 2018హైదరాబాద్:కథానాయకుడు కల్యాణ్ రామ్ రిస్క్ తీసుకున్నారు. ఆయన నటిస్తున్న సినిమా '118'. కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. నివేదా థామస్, షాలిని పాండే కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం కల్యాణ్‌రామ్ రిస్కీ సన్నివేశాల్లో నటిస్తున్నారట. ఇందు కోసం ఆయన నీటిలోతులోకి వెళ్లి ఈత కొట్టేందుకు శిక్షణ తీసుకుంటున్నారు.
ఈ మేరకు తీసిన వీడియోను నిర్మాత మహేశ్ కోనేరు ట్విటర్లో షేర్ చేశారు. కల్యాణ్‌రామ్ '118' కోసం ఏం చేస్తున్నారో ఊహించండి? అని ప్రశ్నించారు. అనంతరం 'కల్యాణ్‌రామ్ '118' సినిమాలోని వాటర్ సీక్వెన్స్ కోసం నీటిలో డీప్ డైవ్ చేయడంలో శిక్షణ తీసుకుంటున్నారు' అని ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కల్యాణ్‌రామ్‌ను ప్రశంసించారు. చాలా కష్టపడుతున్నారని, వృత్తిపట్ల అంకితభావం ఎక్కువని.. కామెంట్లు చేశారు. అంతేకాదు ఊపిరి ఆపుకుని ఉండటం ప్రమాదమని, జాగ్రత్తగా ఉండమని కోరారు.
'118' ట్రెండీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమని చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. జనవరిలో సినిమాను విడుదల చేయనున్నారట. కల్యాణ్‌రామ్ ఇటీవల 'నా నువ్వే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమన్నా కథానాయిక. జయేంద్ర దర్శకుడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు