గవర్నర్‌ను కలవనున్న మహాకూటమి నేతలు

- December 10, 2018 , by Maagulf
గవర్నర్‌ను కలవనున్న మహాకూటమి నేతలు

తెలంగాణ:రేపు వెలువడే ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోతే.. గవర్నర్ నిర్ణయం కీలకమవుతుంది. హంగ్ వస్తే ముందుగా ఎవర్ని పిలవాలన్న విషయంలో ఆయన నిర్ణయమే కీలకం. అందుకే.. కూటమి నేతలు ముందే అప్రమత్తమయ్యారు. ప్రజాకూటమిని ఒకటే జట్టుగా చూడాలంటూ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. రాజ్యాంగ బద్ధంగా నిర్ణయం తీసుకోవాని కోరనున్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో పరిణామాల దృష్ట్యా.. తెలంగాణలో ముందే మేల్కొన్న కాంగ్రెస్ ముందే రాజ్‌భవన్‌ తలుపు తట్టడం కూడా ఆసక్తికర పరిణామం అనే చెప్పాలి.


ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఎన్నికల ముందే తామంతా కూటమిగా ఉన్నందున.. రేపు ఫలితాల తర్వాత మెజార్టీ సాధిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ముందు తమనే పిలవాలని కోరుతున్నారు. ఇవాళ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, ఇన్‌ఛార్జ్ కుంతియా, కూటమి నేతలు ఎల్‌.రమణ, కోదండరామ్ సహా పలువురు నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. అటు, రేపు ఫలితాలు రావడంతోనే కూటమి MLAలు అందరినీ సమావేశ పరిచి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని కూడా ఉత్తమ్ భావిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదన్న పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఎంఐఎం, స్వతంత్రుల్ని కూడా కలుపుకుని వెళ్లేందుు వ్యూహం సిద్ధం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com