మిరాకిల్ గార్డెన్ - ఎమిరేట్స్ మాల్ మధ్య నూతన బస్సు మార్గం

- December 23, 2015 , by Maagulf
మిరాకిల్ గార్డెన్ -  ఎమిరేట్స్ మాల్  మధ్య నూతన బస్సు మార్గం

 మిరాకిల్ గార్డెన్ -  ఎమిరేట్స్ మాల్  మధ్య  నూతన బస్సు మార్గంను గత వారం లో ప్రారంభించినట్లు  రోడ్  ట్రాన్స్పోర్ట్  అథారిటీ వర్గాలు తెలిపాయి. 105 బస్సు మార్గంగా పిలేచే ఫ్లవర్ పార్క్ -  ఎమిరేట్స్ మాల్  ప్రాంతాల మధ్య డిసెంబర్ 17 నుంచి ఈ బస్సు తన సర్వీసును మొదలుపెట్టింది. ఒక  వైపునకు  చేరాలంటే, ప్రయాణికుడు 5 దినార్ల నోల్ కార్డునుకొనుగోలు చేయాల్సి ఉంటుంది. వారం చివర్లో ఈ బస్సు మద్యాహ్నం 12 : 04  సమయానికి మొదలుకానుంది. మిగిలిన రోజులలో సాయంత్రం 3 : 56 కు  ప్రారంభం కానుంది. వారం చివరి రోజులో ఈ బస్సు తిరిగి వెనక్కి రావడానికి ఆఖరు ట్రిప్  రాత్రి  10 : 04 అలాగే, మిగిలిన రోజులలో, తిరిగి రావడానికి రాత్రి  8 : 30  చివరి ట్రిప్ అని అధికార్లు సమాచారం అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com