మణిరత్నం చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న విక్రమ్
- December 10, 2018
కోడంబాక్కం: ఒక్కో దర్శకుడికి ఒక్కో కలల చిత్రం ఉంటుంది. కొందరు దర్శకులు తమ కలల సినిమా కోరికను తొలి చిత్రంతోనే నెరవేర్చుకుంటారు. మరి కొందరికి ఆ సందర్భం రావడానికి కాస్త సమయం పడుతుంది. అలా మణిరత్నం మాత్రం 'పొన్నియిన్ సెల్వం' చిత్రాన్ని ఎప్పటి నుంచో తెరకెక్కించాలని అనుకుంటున్నారు. 'సెక్క చివంద వానం'తో మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించిన ఆయన ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వం' కథను చేతిలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోగా విజయ్, శింబు పేర్లు వినిపించాయి. చివరకు విక్రం నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 'రావణన్' చిత్రంలో మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన విషయం తెలిసిందే. ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇందులో విక్రం ప్రధాన పాత్ర పోషించనున్నారు. మరో ఇద్దరు కథానాయకులు కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే చిత్రీకరణ పనులు మొదలవుతాయని సమాచారం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







