జమాల్ ఖషోగ్గి ఆఖరిమాటలు 'నేను శ్వాస తీసుకోలేను'
- December 10, 2018
వాషింగ్ట్‌న్ : జమాల్ ఖషోగ్గి ఆఖరిమాటలు 'నేను శ్వాస తీసుకోలేను ' ఆడియోటేప్‌లో రికార్డైనట్లు సిఎన్ఎన్ ప్రతినిధి తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్ ఖషోగ్గి మరణించడానికి ముందు ఈ మాటలు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ నివేదిక ద్వారా ఖషోగ్గి హత్య పథకం ప్రకారమే జరిగిందని యుఎస్ నెట్వర్క్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే పలు ఫోన్‌కాల్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయని పేర్కొన్నారు. ఆ ఫోన్‌కాల్స్ రియాద్‌లోని అత్యున్నత అధికారులు చేసినవని టర్కీ అధికారులు నమ్ముతున్నట్లు సిఎన్ఎన్ పేర్కొంది. ఈ రికార్డింగ్ టేప్‌లో ఉన్న మాటలు ఖషోగ్గిని హంతకులు హత్య చేస్తున్న సమయంలో చెప్పినవని సిఎన్ఎన్ పేర్కొంది. కాగా, ఖషోగ్గి హత్య అనుమానితులను అప్పగించాలనే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ డిమాండ్‌ను సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి తిరస్కరించారు. ఈ హత్య రియాద్ అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీసింది. అలాగే అమెరికాతో పాటు ఫ్రాన్స్, కెనడా వంటి పలు దేశాలు 20 సౌదీయులపై నిషేదాన్ని విధించాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







