తెలంగాణ:ఫలితాలకు ముందే ప్రభుత్వ ఏర్పాటు వ్యూహాలు!

- December 10, 2018 , by Maagulf
తెలంగాణ:ఫలితాలకు ముందే ప్రభుత్వ ఏర్పాటు వ్యూహాలు!

తెలంగాణ:రేపు ఈ సమయానికల్లా రిజల్ట్‌ ట్రెండ్ తెలిసిపోతుంది. హంగ్ వస్తుందా.. స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా అన్నదానిపై స్పష్టత వస్తుంది. ఐతే.. ఎందుకైనా మంచిదన్న కోణంలో ప్రధాన పార్టీలు చర్చలు మొదలుపెట్టాయి. ఇప్పటికే BJP తాము TRSకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ముందుకొచ్చింది. కానీ.. మజ్లిస్‌ను వదిలేస్తేనే తాము KCRతో కలిసి పనిచేస్తామని ఆఫర్ ఇచ్చింది. దీన్ని గులాబీ నేతలు తోసిపుచ్చారు. సొంతంగానే తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు MIM చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ- KCR ఫోన్‌లో మాట్లాడడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇవాళ వీరిద్దరి సమావేశం జరగనుంది. ఎన్నికల ముందు నుంచే టీఆర్‌ఎస్‌కు మజ్లిస్ బహిరంగంగానే మద్దతు ప్రకటించినందున ఈ రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగుతుందని గులాబీ నేతలు అంటున్నారు. మరోసారి కేసీఆర్‌ సీఎం అవుతారని కూడా అసద్ వ్యాఖ్యానించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ కూడా నూటికి నూరుశాతం ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనని ధీమాగా ఉన్నారు.


ఐతే.. ఇక్కడే కాంగ్రెస్ కూడా మజ్లిస్ మద్దతు కోసం లాబీయింగ్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌.. మజ్లిస్ చీఫ్ అసద్‌కు ఫోన్ చేశారు. తమతో కలిసి రావాలని కోరారు. కాంగ్రెస్ ప్రతిపాదనపై ఓవైసీ.. మౌనంగానే ఉన్నారు. కేసీఆర్‌కి పూర్తి మద్దతు పలుకుతున్న ఆయన.. హస్తం పార్టీల లాబీయింగ్‌తో మనసు మార్చుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి. ఐతే.. ఐదు రాష్ట్రాల ఫలితాల్లో కాంగ్రెస్ మెరుగైన సీట్లు సాధిస్తే MIM ఈక్వేషన్ మారొచ్చంటున్నారు. ఇదంతా చూస్తుంటే రేపు ఫలితాల తర్వాత రాజకీయం ఎటు మారుతుందోనన్న ఉత్కఠ మాత్రం నెలకొంది. హంగ్ వస్తే స్వతంత్రులతో పాటు ఎంఐఎం కీలకమయ్యే పరిస్థితుల్లో మంగళవారం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలుండొచ్చంటున్నారు విశ్లేషకులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com