జమాల్‌ ఖషోగ్గి ఆఖరిమాటలు 'నేను శ్వాస తీసుకోలేను'

- December 10, 2018 , by Maagulf
జమాల్‌ ఖషోగ్గి ఆఖరిమాటలు 'నేను శ్వాస తీసుకోలేను'

వాషింగ్ట్‌న్‌ : జమాల్‌ ఖషోగ్గి ఆఖరిమాటలు 'నేను శ్వాస తీసుకోలేను ' ఆడియోటేప్‌లో రికార్డైనట్లు సిఎన్‌ఎన్‌ ప్రతినిధి తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్‌ ఖషోగ్గి మరణించడానికి ముందు ఈ మాటలు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ నివేదిక ద్వారా ఖషోగ్గి హత్య పథకం ప్రకారమే జరిగిందని యుఎస్‌ నెట్‌వర్క్‌ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే పలు ఫోన్‌కాల్స్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాయని పేర్కొన్నారు. ఆ ఫోన్‌కాల్స్‌ రియాద్‌లోని అత్యున్నత అధికారులు చేసినవని టర్కీ అధికారులు నమ్ముతున్నట్లు సిఎన్‌ఎన్‌ పేర్కొంది. ఈ రికార్డింగ్‌ టేప్‌లో ఉన్న మాటలు ఖషోగ్గిని హంతకులు హత్య చేస్తున్న సమయంలో చెప్పినవని సిఎన్‌ఎన్‌ పేర్కొంది. కాగా, ఖషోగ్గి హత్య అనుమానితులను అప్పగించాలనే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ డిమాండ్‌ను సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి తిరస్కరించారు. ఈ హత్య రియాద్‌ అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీసింది. అలాగే అమెరికాతో పాటు ఫ్రాన్స్‌, కెనడా వంటి పలు దేశాలు 20 సౌదీయులపై నిషేదాన్ని విధించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com