గన్ పాయింట్: కువైటీ కార్ల దొంగతనం
- December 10, 2018
కువైట్ సిటీ: ముబారక్ అల్ కబీర్ సెక్యూరిటీ కమాండ్ డిటెక్టివ్స్ 30 ఏళ్ళ కువైటీ పౌరుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడు, అబు అల్ హసానియాలోని కంపాట్రియేట్ నుంచి గన్ పాయింట్‌లో బెదిరించి కారుని దొంగతనం చేశాడు. బాధితుడ్ని, అలాగే అక్కడున్నవారిని తుపాకీతో నిందితుడు బెదిరించి, కారుతో ఉడాయించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే, సంబందిత డిపార్ట్‌మెంట్స్‌కి విషయాన్ని చేరవేశారు. డిటెక్టివ్స్, నిందితుడ్ని గుర్తించారు. ఇటీవలే నిందితుడు సెంట్రల్ జైలు నుంచి విడుదలయినట్లు తెలియడంతో, అత్యంత చాకచక్యంగా కబాద్‌లోని యానిమల్ పెన్ వద్ద అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడు దొంగిలించిన కారుని సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







