ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో 2.0
- December 10, 2018
సౌత్ సినిమాలకు విదేశాల్లో మంచి ఆదరణ అందుతోందని రికార్డ్ ద్వారా క్లియర్ గా అర్ధమవుతోంది. పక్కింటి హాలీవుడ్కూరకు ఎంత అలవాటు పడినా కూడా ప్రవాసులు సొంతసౌత్ ఇండియన్ సినిమాలను వదిలిపెట్టడం లేదు. వాళ్లకు నచ్చింది అంటే సినిమా రిజల్ట్ ఒక్కసారిగా మారిపోతుంది. 2.0 యూఎస్ లో ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.
మొదట్లో కలెక్షన్స్ చూసి కంగారుపెట్టినా ఆ తరువాత 2.0 వీకెండ్స్ ను టార్గెట్ చేసి మంచి లాభాలను అందించింది. ఇప్పుడు 5 మిలియన్ డాలర్స్ ను క్రాస్ చేసి ఇండియన్ బెస్ట్ ఫిల్మ్ గా 2.0 నిలిచింది. ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్స్ లో మూడవ స్థానానికి చేరుకుంది.
బాహుబలి ఫస్ట్ పార్ట్ $6.5 మిలియన్స్ తో రెండవ స్థానంలో ఉండగా బాహుబలి 2 లైఫ్ టైమ్ గ్రాస్ $20.5 మిలియన్స్ తో మొదటి స్థానంలో ఉంది. 2.0 $5M కలెక్షన్స్ తో మూడవ స్థానాన్ని దక్కించుకొని నాట్ అవుట్ గా బాక్స్ ఆఫీస్ గ్రీజ్ లో ఉంది. చూస్తుంటే 7 మిలియన్ గ్రాస్ ను అందుకునేలా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఈ విజువల్ వండర్యూఎస్ లో ఎంతవరకు రాబడుతుందో చూడాలి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







