తొలి సోలార్ పవర్డ్ ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన మవసలాత్
- December 11, 2018
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్), ఒమన్ అవెన్యూస్ మాల్తో కలిసి తొలి సోలార్ పవర్డ్ ఎయిర్ కండిషన్డ్ బస్ స్టాప్‌ని ఏర్పాటు చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. సోలార్ పవర్డ్ అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లేస్ కూడా ఇందులో పొందుపర్చారు. 10 నుంచి 15 మందికి వీలుగా రూపొందించిన ఈ బస్ స్టాప్‌లో మొబైల్ ఛార్జింగ్ యూనిట్స్ కూడా వున్నాయి. లులు హైపర్ మార్కెట్‌తో కుదుర్చుకున్న మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో ఒమన్ అవెన్యూస్ మాల్ ఈ ఎయిర్ కండిషన్డ్ స్టేషన్‌కి పేరు పెట్టనుంది. అలాగే, అడ్వర్టైజ్మెంట్స్నీ డిస్ప్లే చేయనుంది. సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌లో కమర్షియల్ సెంటర్ వద్ద దీన్ని నిర్మించారు. వైఫై సహా అనేక సౌకర్యాలు ఇందులో వుంటాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







