మిస్సింగ్ వలసదారుడి మృతి
- December 11, 2018
బహ్రెయిన్: భారత జాతీయుడైన వలసదారుడొకరు హిద్ ప్రాంతంలోని తన కారులో మృతి చెందారు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందారు. అపార్ట్మెంట్ నుంచి అతను వెళ్ళి, ఎంత సేపటికీ తిరిగి రాలేదని పేర్కొంటూ, సన్నిహితులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అతని ఆచూకీ కోసం ప్రయత్నించారు. మృతుడ్ని సతీష్‌కుమార్‌గా గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా, సతీష్‌కుమార్ ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు అతని ఆచూకీ కనుగొనగలిగినా, దురదృష్టవశాత్తూ మృతదేహాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. గత ఏడాది సతీష్కుమార్కి స్ట్రోక్ వచ్చిందనీ, అదే అతని మృతికి కారణమయి వుండొచ్చని అనుమానిస్తున్నారు. బహ్రెయిన్‌లో 30 ఏళ్ళుగా సతీష్‌కుమార్ నివసిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







