ఉప్పు అధికంగా తీసుకుంటే....
- December 12, 2018నేటి తరుణంలో ఎక్కడ చూసినా హైబీపీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఎలాంటి లాభాలు కనిపించవు. అంతేకాదు.. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. హైబీపీని తగ్గించాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే...
1. ఎక్కువగా పచ్చళ్లు, నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోరాదు. వీటిని అధిక మోతాదులో తీసుకున్న వారికి బీపీ అధికమై గుండెపోటు వచ్చే ప్రమాదముందని ఇటివలే ఓ పరిశోధనలో తెలియజేశారు.
2. నిత్యం ప్రతిరోజూ మీరు తయారుచేసుకునే వంటకాల్లో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతే రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలని వైద్యులు చెప్తున్నారు.
3. బయట దొరికే ఫాస్ట్ఫుడ్స్, స్నాక్స్ వంటి పదార్థాలు తినడం మానేయాలి. ఈ పదార్థాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుకు వీలైనంత వరకు ఇంట్లో చేసిన సహజసిద్ధమైన పదార్థాలు తినాలి. అప్పుడే ఎలాంటి అనార్యోలు రావు.
4. ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలానే పండ్లు, కూరగాయలు, నట్స్, ఆరోగ్యవంతమైన నూనెలు, పప్పులు, తృణ ధాన్యాలు వంటల్లో ఉపయోగించాలి. ఇలా చేస్తే హైబీపీ తగ్గుముఖం పడుతుంది.
5. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నచో.. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇది హైబీపీకి దారితీస్తుంది. కనుకు కొవ్వు ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం మానేయండి.. దీంతోపాటు రోజూ ఉదయాన్నే ఓ అరగంటపాటు వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!