మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ దృష్టి..
- December 12, 2018
తెలంగాణ:ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టింది టీఆర్ఎస్. రేపు ఉదయం 8గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, కొద్దిమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ గవర్నర్‌ను కలిసి సమాచారమిచ్చారు.
ఇవాళ ఉదయం 11న్నర గంటలకు తెలంగాణ భవన్‌లో TRS-LP సమావేశం జరగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు… మరోవైపు మంత్రివర్గ కూర్పపై కేసీఆర్ దృష్టిపెట్టారు. పలువురి పేర్లను ఆయన పరిశీలించినట్లు సమాచారం. నలుగురు మంత్రులు ఓడిపోయినందున వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం.. ప్రస్తుతం ఉన్నవారిలో కొందరిని మార్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది..
ప్రభుత్వం ఏర్పడ్డాక శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.. ఇందుకోసం ప్రోటెం స్పీకర్‌గా రెడ్యానాయక్‌ను నియమించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అలాగే స్పీకర్ మధుసూదనాచారి ఓడిపోవడంతో ఆయన స్థానంలో కొత్త స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







