ఉప్పు అధికంగా తీసుకుంటే....
- December 12, 2018
నేటి తరుణంలో ఎక్కడ చూసినా హైబీపీ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఎలాంటి లాభాలు కనిపించవు. అంతేకాదు.. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు నిపుణులు. హైబీపీని తగ్గించాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే...
1. ఎక్కువగా పచ్చళ్లు, నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తీసుకోరాదు. వీటిని అధిక మోతాదులో తీసుకున్న వారికి బీపీ అధికమై గుండెపోటు వచ్చే ప్రమాదముందని ఇటివలే ఓ పరిశోధనలో తెలియజేశారు.
2. నిత్యం ప్రతిరోజూ మీరు తయారుచేసుకునే వంటకాల్లో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంతే రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే వాడాలని వైద్యులు చెప్తున్నారు.
3. బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్స్, స్నాక్స్ వంటి పదార్థాలు తినడం మానేయాలి. ఈ పదార్థాల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుకు వీలైనంత వరకు ఇంట్లో చేసిన సహజసిద్ధమైన పదార్థాలు తినాలి. అప్పుడే ఎలాంటి అనార్యోలు రావు.
4. ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండే ఆహారాలను తీసుకోవాలి. అలానే పండ్లు, కూరగాయలు, నట్స్, ఆరోగ్యవంతమైన నూనెలు, పప్పులు, తృణ ధాన్యాలు వంటల్లో ఉపయోగించాలి. ఇలా చేస్తే హైబీపీ తగ్గుముఖం పడుతుంది.
5. శరీరంలో కొవ్వు శాతం అధికంగా ఉన్నచో.. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఇది హైబీపీకి దారితీస్తుంది. కనుకు కొవ్వు ఎక్కువగా ఉన్న వాటిని తీసుకోవడం మానేయండి.. దీంతోపాటు రోజూ ఉదయాన్నే ఓ అరగంటపాటు వ్యాయామం చేస్తే ఫలితం ఉంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







